- తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : క్షేత్రస్థాయి విద్యారంగా సమస్యలపై తెలంగాణ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో క్షేత్రస్థాయి ఉన్నత విద్యారంగ సమస్యలను సమగ్రంగా ప్రభుత్వానికి నివేదించడానికి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఐఏఎస్ ఆధ్వర్యంలో ప్రజావాణిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజ్ ని, ఫార్మసి కాలేజ్ ని మంజూరు చేయించాలన్నారు. నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలను తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకురావాలన్నారు. విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని హాస్టల్లో ఉన్న మౌలిక సమస్యలను, ప్రయోగశాలల కొరతను, గ్రంథాలయంలోని పుస్తకాల కొరతను కమిషన్ దృష్టికి తీసుకొచ్చి సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ కోచింగ్ సంస్థలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పున్నయ్య మాట్లాడుతూ విద్యారంగంలో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు న్నాయన్నారు. దశాబ్ద కాలంగా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు నియామకం జరగడంలేదని రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2000 పైగా అధ్యాపక ఖాళీలు ఉన్నాయని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేసినారు. సంవత్సరాలుగా పదోన్నతి లేక అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారని సాంకేతిక కారణాలన్నింటినీ పరిష్కరించి పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.

పదోన్నత ఛాన్స్లర్ నామినీ కోసం ఆరు నెలలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నప్పటికీ ఛాన్స్లర్ నామినీ నియామకం కాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఛాన్స్లర్ నామినిని నియమించాలన్నారు. అకాడమిక్ కన్సల్టెంట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ గంగ కిషన్ మాట్లాడుతూ అకాడమిక్ కన్సల్టెంట్ అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల రాష్ట్ర సహాయ కార్యదర్శి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలతో కళాశాలలు కొనసాగించలేమన్నారు. దోస్తు, బకెట్ సిస్టం లాంటి అడ్మిషన్స్ నిబంధనలతో ప్రైవేటు కళాశాలలో మూతపడే స్థితికి వచ్చిందన్నారు. ఫ్రీ రియంబర్స్మెంట్ వెంటనే మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రో. టి. యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రో. ఎం. యాదగిరి, ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ ఎల్ విశ్వేశ్వరరావు లు కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల, కంట్రోలర్ ఆచార్యకే సంపత్ కుమార్, ఆడి సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్, ఆచార్య కనకయ్య, టూ టా జనరల్ సెక్రెటరీ డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ జమీల్ అహ్మద్, తదితర బోధన బోధ నేతర సిబ్బందితోపాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
