Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 December 2024, 4:09 pm Posted by : ramakrishna

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ

కామారెడ్డి, బతుకమ్మ : సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైస్ చేయాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ డిమాండ్ చేశారు. మొదటగా కామారెడ్డి పట్టణానికి వచ్చిన స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల మురళి గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెకు బుధవారం సంఘీభావం తెలిపి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు . ఈ సందర్భంగా ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ విద్యాశాఖ లో భాగంగా పని చేస్తూ, గత ఎనిమిది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు చట్టబద్ధంగా నియమించబడ్డారన్నారు. వారిని రెగ్యులరైజ్ చేయండి లేదంటే పే స్కేల్ అమలు చేయాలని కోరారు.  ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న అన్ని వసతులు కల్పించాలన్నారు. వీరి న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2023 లో ఇదే సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెను విరమింపజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు వీరి సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.

Comprehensive punishment should regularize the employees