సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి

టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ నిజామాబాద్, బతుకమ్మ : గత 20రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ సమగ్ర శిశు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెకు టీఎన్జీవో ఆధ్వర్యంలో గురువారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరుపుటకు తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు....