Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 December 2024, 5:03 pm Posted by : ramakrishna

సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి

  • టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్

నిజామాబాద్, బతుకమ్మ : గత 20రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ సమగ్ర శిశు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెకు టీఎన్జీవో ఆధ్వర్యంలో గురువారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరుపుటకు తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.  సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేకూరేవరకు ఉద్యమంలో ఉంటామని సంపూర్ణ మద్దతు పలికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమానికి టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు జీ.సంజీవయ్య, టీఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి భీంగల్ యూనిట్ అధ్యక్షులు సృజన్ కుమార్, ఆర్మూర్ యూనిట్ కార్యదర్శి విశాల్ ,టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, టిఎన్జీవో నాయకులు, ఉద్యోగులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

Comprehensive punishment should fulfill the demands of employees