సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
బీవీఎం రాష్ట్ర కార్యదర్శి ఙివియం.విఠల్ నిజామాబాద్, బతుకమ్మ : సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంగళవారం భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఙివియం విఠల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు గత కొన్ని రోజులుగా వారి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తున్నారని తెలిపారు. వీరి వల్ల విద్యా వ్యవస్థ పూర్తిగా స్తంభించిందని అన్నారు. గత ప్రభుత్వం కూడా వారి సమస్యలు పరిష్కరించకుండా...