- బీవీఎం రాష్ట్ర కార్యదర్శి ఙివియం.విఠల్
నిజామాబాద్, బతుకమ్మ : సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంగళవారం భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఙివియం విఠల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు గత కొన్ని రోజులుగా వారి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తున్నారని తెలిపారు. వీరి వల్ల విద్యా వ్యవస్థ పూర్తిగా స్తంభించిందని అన్నారు. గత ప్రభుత్వం కూడా వారి సమస్యలు పరిష్కరించకుండా వారిని మభ్యపెడుతూ వచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాలలో సమగ్ర శిక్ష ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తామని ఉద్యోగ భరోసా కల్పిస్తామని ప్రకటించారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తాను స్వయంగా వారితో మాట్లాడి మీ సమస్యలను మా ప్రభుత్వం ఏర్పడితే 100 రోజుల్లో మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తుల గుర్తించి ప్రభుత్వం నుంచి అచ్చే బెనిఫిట్ అని అందిస్తామని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం గడిచింది కానీ వారి సమస్యలు ప్రభుత్వం పట్టించుకోకుండా వారితో సంప్రదింపులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల సమ్మెల ఉండడం వల్ల కేజీబీవి లో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని తెలిపారు. విద్యాశాఖ కార్యాలయాలు ఆపరేటర్స్ లేకపోవడం వల్ల మూసివేస్తున్నారని అనానరు. విద్యార్థులు జీవితాలతో చెలగాటమడితే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని అన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీరి సమస్యలను పరిష్కరించి వారిని న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రావణ్ ,అజయ్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.