నిజామాబాద్, బతుకమ్మ: నగరంలో ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వేను నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ పరిశీలించారు. రేడియో స్టేషన్ ప్రాంతంలోని న్యాల్ కల్ రోడ్డులో సర్వే చేస్తున్న సిబ్బంది వద్దకు వెళ్లారు. నిర్దేశిత ప్రొఫార్మ ప్రకారం వివరాల సేకరణ, నమోదు తీరుపై ఆరా తీసి సిబ్బంది సలహాలు, సూచనలు చేశారు.