క్షేత్రస్థాయి పరిశీలనలో సమగ్ర వివరాలను సేకరించాలి
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమమంతు సిరికొండ, ధర్పల్లి మండలాల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ తనిఖీ నిజామాబాద్, బతుకమ్మ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా సమగ్ర వివరాలను సేకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు, సర్వే బృందాలకు సూచించారు. సేకరించిన వివరాలను వెంటదివెంట తప్పులు లేకుండా క్రమపద్ధతిలో రిజిస్టర్లలో నమోదు చేసుకోవాలని, తద్వారా డేటా ఎంట్రీ సమయంలో...