Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 October 2024, 1:46 pm Posted by : ramakrishna

ఓటరు జాబితాను త్వరగా పూర్తి చేయండి

పిట్లం, బతుకమ్మ: స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటరు జాబితాను త్వరగా పూర్తి చేయాలని తహసీల్దార్ ను అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. తహసీల్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ బుధవారం సందర్శించారు. వార్డుల వారీగా ఓటరు జాబితా తయారీపై ఆరా తీశారు. ఆయన వెంట తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో కమలాకర్, ఎంపీవో యాదగిరి, గిర్దావర్ శీతల్, తహసీల్ కార్యాలయ, సిబ్బంది పాల్గొన్నారు.