- ఆయుర్వేదిక్ డాక్టర్ రత్నం
బతుకమ్మ, పిట్లం : ప్రతినిత్యం మన దైనందిక జీవితంలో యోగా చేయడం వల్ల శారీరక మానసిక రుగ్మతలు దూరమవుతాయని, యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని అయూర్వేదిక్ డాక్టర్ రత్నం పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం పీట్లం మండలంలోని చిల్లర్గిపాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన కావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవం నిర్వహిస్తారన్నారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఆధ్యాత్మిక, ప్రయోజనాలు కలుగుతాయన్నారు. వీటిపై అవగాహన పెంచుకోవడం కోసమే ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించుకోవాలన్నారు. యోగ అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకుని, మనుషులలో ఉన్న ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి, వారిని నిరాశ, నిస్పృహల నుంచి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందన్నారు. అనంతరం యోగా గురువులు కార్తీక్ సౌజన్య ద్వారా యోగాలో ఉన్న అన్ని అంశాలను సాధన చేశారు. యోగ దినోత్సవ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు ప్రజలు యువకులు పాఠశాలల విద్యార్థులు, ఆయుష్ బృందం తదితరులు పాల్గొన్నారు.