ప్రజావాణికి వెల్లువెత్తిన ఫిర్యాదులు

అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలి : కలెక్టర్ బతుకమ్మ, నిజామాబాద్, ఆగస్టు 12 : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటదివెంట పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 154 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్,...