Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 6:21 pm Posted by : ramakrishna

ఫిర్యాదులను చట్టప్రకారం పరిష్కరించాలి

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రజావాణి ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి 11 ఫిర్యాదులను స్వీకరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు.  ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని తెలిపారు. వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల , పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని అన్నారు.  ప్రజా సమస్యల పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి  కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని తెలిపారు.