- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
- పోలీస్ ప్రజావాణికి 22ఫిర్యాదులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి 22 అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల ఎస్.ఐ, సి.ఐ లకు ఫోన్ ద్వారా సమస్య స్థితిని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని తెలిపారు. వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని అన్నారు. ప్రజా సమస్యల పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని అన్నారు.
