Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2025, 7:44 pm Posted by : ramakrishna

ఫిర్యాదులను చట్టప్రకారం పరిష్కరించాలి

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి.సాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదిదారుల  నుండి  14 ఫిర్యాదులను  స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల యొక్క ఎస్.ఐ, సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని పరిష్కారానికి సూచనలు చేశారు.  ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలియజేశారు.  ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి  కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నాము అని తెలియజేశారు.

Complaints should be resolved according to law.