Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 July 2025, 5:07 pm Posted by : ramakrishna

చట్టప్రకారం ఫిర్యాదులను పరిష్కరించాలి

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
  • పోలీస్ ప్రజావాణికి 26 ఫిర్యాదులు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రజావాణి ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సంబధిత అధికారులను ఆదేశించారు. నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి  కార్యక్రమంలో భాగంగా 26 ఫిర్యాదులను  స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల యొక్క ఎస్.ఐ సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు.

Complaints should be resolved according to law