Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 5:23 pm Posted by : ramakrishna

చట్ట ప్రకారం ఫిర్యాదులను పరిష్కరించాలి

  • పోలీస్ కమిషనర్ సాయిచైతన్య
  • పోలీస్ ప్రజావాణికి 32ఫిర్యాదులు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను చట్టప్రకారం పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య అధికారులను ఆదేశించారు. నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 32అర్జీలను స్వీకరించారు.  ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని తెలిపారు. వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలియజేశారు. ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి  కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని అనారు.

Complaints should be resolved according to law