Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2024, 4:20 pm Posted by : ramakrishna

ప్రజావాణిలో అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

  • కామాెరెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 

కామారెడ్డి, బతుకమ్మ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారు నుండి పలు సమస్యల పై దరఖాస్తులు స్వీకరించారు.

Complaints in public should be dealt with promptly

భూ సంబంధ మైన అర్జీలు, ఋణాలు మంజూరు, వ్యక్తిగత సమస్యల పై అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికై సంబంధిత అధికారులకు అందజేశారు. ఆయా అర్జీలను పరిశీలించి అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు (69) అర్జీలను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, ఆర్డీఓ రంగనాథ్ రావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Complaints in public should be dealt with promptly