హిందూ సంఘాల ఐక్యవేదిక  ఆధ్వర్యంలో కలెక్టర్ కు ఫిర్యాదు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  హిందూ సంఘాల ఐక్యవేదిక వర్ని ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు పటేల్ ప్రసాద్ మాట్లాడుతూ వర్ని కేంద్రంలోని సత్యనారాయణపురం గ్రామంలో రామాలయం వెనకాలే ఉన్న చర్చి వద్ద యాబై అడుగుల ఎత్తులో ఒక కట్టడాన్ని దేవ సహాయం అనే పాస్టరు నిర్మిస్తున్నారని తెలిపారు. దీని విషయంలో ఇంతకుముందే హైకోర్టు ద్వారా స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ మళ్లీ ఇప్పుడు తిరిగి ఆ నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు....