Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 March 2025, 5:24 pm Posted by : ramakrishna

హిందూ సంఘాల ఐక్యవేదిక  ఆధ్వర్యంలో కలెక్టర్ కు ఫిర్యాదు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  హిందూ సంఘాల ఐక్యవేదిక వర్ని ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు పటేల్ ప్రసాద్ మాట్లాడుతూ వర్ని కేంద్రంలోని సత్యనారాయణపురం గ్రామంలో రామాలయం వెనకాలే ఉన్న చర్చి వద్ద యాబై అడుగుల ఎత్తులో ఒక కట్టడాన్ని దేవ సహాయం అనే పాస్టరు నిర్మిస్తున్నారని తెలిపారు. దీని విషయంలో ఇంతకుముందే హైకోర్టు ద్వారా స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ మళ్లీ ఇప్పుడు తిరిగి ఆ నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు. ఆ చుట్టూ గ్రామంలో ఎలాంటి క్రైస్తవులు లేనప్పటికీ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ నిర్మాణాన్ని చేపట్టారని తెలిపారు. అక్కడ ఉన్న చర్చికి ఎలాంటి అనుమతులు రిజిస్ట్రేషన్ అలాట్మెంట్ లేనప్పటికీ చర్చి నిర్మించి ఇప్పుడు మళ్లీ ఈ కట్టడాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. స్థానికంగా ఉన్న సెక్రెటరీ, ఎమ్మార్వో ఎవరు కూడా స్పందించడం లేదని హైకోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా మళ్ళీ నిర్మాణం చేపడుతున్న ఆ పాస్టర్ దేవ సహాయం పై చర్యలు తీసుకోవాలని, ఆ కట్టడాన్ని తొలగించాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అలా జరగని పక్షంలో తీవ్రమైన ఉద్యమం వర్ని కేంద్రంగా జరుపుతామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు పిట్ల స్వామి, పార్వతి మురళి, బోత్ కిషన్ భాస్కర్, సుబ్రహ్మణ్యం స్వామి, ప్రతాప్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Complaint to the Collector under the auspices of the United Forum of Hindu Sanghas