Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2025, 5:24 pm Posted by : ramakrishna

ఏపీడీ, డీపీఎంలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా సమాఖ్య ఏపీడీ, డీపీఎంలపై చర్యలు తీసుకోవాలని జిల్లా సమాఖ్య సభ్యులు శనివారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పీడీకి, మండల అధ్యక్షులకు తెలియకుండానే జిల్లా జనరల్ బాడీ  మీటింగ్ లు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ ఇద్దరే అన్నీ తామే అనే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మండల జనరల్ బాడీ మీటింగులు మండల ఓబీలకు తెలియకుండానే నిర్వహిస్తున్నారని అన్నారు. ఇలా చేయడం తప్పు అన్ని చెబితే ఈసీ మెంబర్లు పీడీకి లెటర్లు ఇస్తున్నారని తెలిపారు. రాజీనామా చేయెద్దని మండల, జిల్లా వ్యాప్తంగా ఏపీఓ, డీపీఓం పెత్తనం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు. గత 18ఏళ్లుగా డీపీఎం అదే పోస్టులో కొనసాగుతన్నాడని తెలిపారు. కమ్యూనిటీని, సిబ్బందితో ఏపీడీ అసభ్యంగా మాట్లాడుతున్నాడని తెలిపారు. ఎపీడీ, డీపఎం చెప్పినట్లే పనులు జరుగుతున్నాయని, వీటిని పీడీకి కూడా తెలియనివ్వడం లేదని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన సంఘాలను తమను నడిపించుకోకుండా వారే నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా సమాఖ్య జనరల్ బాడీ మీటింగ్ లో నవీపేట్ మండల సమాఖ్యను బహిష్కరించారని తెలిపారు. జిల్లా అధ్యక్షురాలు చెప్పినా కూడా అదే తప్పు చేస్తున్నారని అన్నారు. సీసీలను ఏపీడీ బెదిరించి తొలగిస్తున్నరనా ఆరోపించారు. తాము మీటింగ్ నిర్వహించిన తరువాత కూడా సీసీలను బెదిరించి మళ్లీ మీటింగ్ నిర్వహిస్తున్నారని అన్నారు.