Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2025, 1:36 pm Posted by : ramakrishna

పోచారం శ్రీనివాస్ రెడ్డి పై కలెక్టర్ కు ఫిర్యాదు

. పెద్ద సంఖ్యలో కలెక్టరేట్ కు తరలి వచ్చిన ఏనుగు వర్గీయులు
నిజామాబాద్, బతుకమ్మ: తన అనుచరులకు కాంట్రాక్ట్ పనులను అప్పగిస్తూ గ్రామాల నుంచి వచ్చే ప్రతిపాదనలను బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు పెద్ద సంఖ్యలో నిజామాబాద్ కు కలెక్టరేట్ కు రవీందర్ రెడ్డి వర్గీయులు తరలిరావడంతో వీరి మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ప్రధాన గేటు వద్దే ఏనుగు వర్గీయులను అడ్డుకొని లోనికి రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. తమను లోనికి ఎందుకు అనుమతించలేదు అంటూ పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. అనంతరం జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ గేట్ వద్దకు వచ్చి ఫిర్యాదును స్వీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా కాంటాక్ట్ పనులు అప్పగించడం పై విచారణ జరుపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాన్స్వాడ నియోజకవర్గం నుంచి సుమారు 150 వాహనాల్లో 500 మందికిపై గా కలెక్టరేట్ కు తరలిరావడంతో ఉద్రికత్త నెలకొంది.


Complaint to the Collector against Pocharam Srinivas Reddy