Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2024, 4:40 pm Posted by : ramakrishna

బ్రిలియంట్ పాఠశాలపై ఎంఈఓకు ఫిర్యాదు 

ఆర్మూర్, బతుకమ్మ :  అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ బ్రిలియంట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐపిఎస్యూ  ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి గోపాల్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ… ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని బ్రిలియంట్ పాఠశాల యాజమాన్యం నిబంధనకు విరుద్ధంగా పదో తరగతి విద్యార్థుల పరీక్ష రుసం 185 రూపాయలు ఉండగా, పాఠశాల యాజమాన్యం విద్యార్థుల నుండి 500 రూపాయలు వసూలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా పాఠశాల కమర్షియల్ బిల్డింగ్ లో నడుపుతూ, ఆటస్థలం లేకుండా అలాగే ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా పాఠశాలను నడుపుతున్నారని మండిపడ్డారు. ఫీజు డిస్ప్లే చేయకుండా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఇప్పటికైనా ఎంఈఓ స్పందించి, అట్టి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వెంటనే ఆ పాఠశాల యొక్క గుర్తింపును రద్దు చేయాలని  కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివ,గణేష్ తదితరులు ఉన్నారు.