పంచాయతీ కార్యదర్శి పై దాడికి పాల్పడిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు

జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండలంలోని మహిబాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిపంచాయతీ విజయ్ కుమార్ పై దాడికి పాల్పడిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీకి పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల  సంఘం జిల్లా అధ్యక్షుడు మహేష్  గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో గ్రామాన్ని తమ భుజస్కందాలపై మోస్తున్న పంచాయతి కార్యదర్శి పై దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు. మహిబాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి  విజయకుమార్  బుధవారం తన విధి నిర్వాహణ లో భాగంగా ఇంటి...