Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2025, 3:36 pm Posted by : ramakrishna

ఇసుక క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలిని ఫిర్యాదు

బోధన్, బతుకమ్మ : ఓవర్ లోడ్, అంతులేని ఇసుక తవ్వకాలు జరుపుతున్న మందర్న ఇసుక క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి పోచిరాం బోధన్ సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సాలూరా మండలంలోని మందర్న గ్రామంలో ఓ  ప్రైవేట్ పట్టాదారుడికి ఇసుక త్వకాలను మైనింగ్ శాఖ అనుమతి ఇచ్చిందని  తెలిపారు. పట్టా  భూమిలో ఇసుక మేటలు ఉన్నాయని వాటిని అమ్ముకోవడానికి అనుమతి తీసుకున్న ఆయన ఆ భూమిలో అంతులేని ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని అన్నారు. సహజ సంపద దోపిడీకి పాల్పడుతున్నాడని అన్నారు. మైనింగ్, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేదన్నారు. టిప్పర్  లు ఓవర్ లోడ్ తో సోంపూర్, సుంకిని గ్రామాల శివారులో నుంచి వెళ్లడం వల్ల రోడ్డు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. దుమ్మ, దూళితో పంటలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్న ఇసుక క్వారీ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.