Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 September 2024, 6:48 pm Posted by : ramakrishna

మూడవ కల్లు డిపోలో ఆక్రమాలపై ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు సభ్యుల ఫిర్యాదు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : భవాని కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం నిజామాబాద్ -3 అధ్యక్షలు కొత్తూరు రవీంధర్ గౌడ్ అధ్వర్యంలో పాలకవర్గం అవినీతి ఆక్రమాలకు పాల్పడుతుందని ఈ విషయంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సోసైటి సభ్యులు నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. గురువారం సోసైటి సభ్యులు పిర్యాదు చేసిని ఆనంతరం విలేఖరులతో మాట్లాడుతు… నిజామాబాద్ అధ్యక్షులు కొత్తూరు రవీంధర్ గౌడ్ సొసైటీ డబ్బులను దుర్వినియోగం చేస్తూ కార్మికులకు చేస్తున్న మోసాల పై విచారణ జరుగాలని అన్నారు. అధ్యక్షలు కొత్తూరు రవీంధర్ గౌడ్ , సేపూర్ స్వామిగౌడ్, సేపూర్ సుమన్ గౌడ్లు , సొసైటీకి సంబంధం లేని వ్యక్తులు అయిన సేపూర్ జయసింహ గౌడ్, బుర్ర శ్యాంసుందర్ గౌడ్, ఎస్. నాగరాజు గౌడ్లతో కుమ్మక్కై సొసైటీ డబ్బులను వారికి ధారాదత్తం చేస్తూ వారితో పాటే పంచుకుంటున్నారు అని ఆరోపించారు. కార్మికులే యజమానులుగా డిపోను నడుపుతున్నామని బయటకు చెబుతూ కార్మికులకు మాత్రం గత సంవత్సరంనుండి కేవలం నెలకు రూ.4 వేలు మాత్రమే ఇస్తు, వచ్చిన లాభాలను కార్మికులకు పంచకుండా అధ్యక్షులు సొసైటీలోని సేపూరు స్వామి గౌడ్ ,సేపూరి సుమన్ గౌడ్ లతో కుమ్మక్కై సొసైటీ డబ్బులను కాజేస్తున్నారు అన్నారు. కార్మికులకు ఎటువంటి సంబంధం లేకుండా డిపోలో కార్మికులకు చెందిన వాటాలను అక్రమంగా బయట వ్యక్తులకు లక్షల రూపాయలకు అమ్ముకోవడం జరిగిందన్నారు. టిసియస్-3 అధ్యక్షులు కె. రవీంధర్ గౌడ్ సొసైటీ బై లాకు విరుద్ధంగా వెళ్ళుతూ కార్మికులకు రావలసిన వాటాలను లాభాలను ఇవ్వకుండా తన సొంత నిర్ణయాలు తీసుకొని బయట వ్యక్తులకు అప్పజెప్పి అక్రమాలకు పాల్పడుతున్నందున విచారణ జరిపి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరారు. డిపో నిర్వహణలో అక్రమంగా చొరబడిన వ్యక్తులు సేపూరు జయసింహా గౌడ్, బుర్ర శ్యాంసుందర్ గౌడ్ఎస్. నాగరాజు గౌడ్లను డిపోనుండి బయటకు పంపాలని, డిపోను కార్మికులే నిర్వహించుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు పిర్యాదు చేశామన్నారు.

Complaint by members to Superintendent of Excise on encroachment at third Kallu depot