Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 November 2025, 5:11 pm Posted by : ramakrishna

జెడి.సారయ్య పై అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జెడి సారయ్య పై చర్యలు తీసుకోవాలని ఇందూరు గాయత్రి బ్రాహ్మణ అర్చక పురోహిత సమాఖ్య ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇందూరు గాయత్రి బ్రాహ్మణ అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షులు బి శ్రీనివాస్ శర్మ మాట్లాడారు. డప్పు చంద్రం సంస్మరణ సభలో జె.డి,సారయ్య,  వారి బృందం ఒక కార్యక్రమం లో బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, బ్రాహ్మణ జాతిని,  బ్రాహ్మణుల కట్టు బొట్టును అవమానిస్తూ యజ్ఞోపవీత ధారణ గురించి  అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. జే.డి.సారయ్య, వారి బృందం పైన చట్టపరమైన  చర్యలు   తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇందూరు గాయత్రి బ్రాహ్మణ అర్చక పురోహిత సమాఖ్య, శ్రీ వైష్ణవ సంఘం సమాఖ్య, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూర్ సమాఖ్య, ఇందూరు బ్రాహ్మణ సేవ సంఘం, బ్రాహ్మణ సంఘం సభ్యులు అజయ్ సంగ్వాయ్,  బి.కృష్ణమాచారి, పి.సుభాష్ శర్మ, రమేష్ కులకర్ణి, ఈమని సాయిప్రసాద్, లక్ష్మి నారాయణ భరద్వాజ్, జయంత్ రావు ముప్కాల్ కర్, రాజ్ కాంత్ రావు కులకర్ణి, ఉమా మహేశ్వర ప్రసాద్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Complaint against JD Saraiah to Additional SP