అడిషనల్ కలెక్టర్ పై ఫిర్యాదు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి కరీంనగర్ ఎన్నికల అధికారి పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి దేవతి శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఈనెల 6న కరీంనగర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు. ఇందులో తన ఓటరు నమోదుకు సంబంధించిన కాపీ, సర్టఫైడ్ కాపీ సమర్పించలేదని కరీంనగర్ ఎన్నికల అధికారి కార్యాలయం తనకు మెమో జారీ చేసిందన్నారు. ఎన్నికల...