Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 February 2025, 7:25 pm Posted by : ramakrishna

అడిషనల్ కలెక్టర్ పై ఫిర్యాదు

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి కరీంనగర్ ఎన్నికల అధికారి పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి దేవతి శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఈనెల 6న కరీంనగర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు. ఇందులో తన ఓటరు నమోదుకు సంబంధించిన కాపీ, సర్టఫైడ్ కాపీ సమర్పించలేదని కరీంనగర్ ఎన్నికల అధికారి కార్యాలయం తనకు మెమో జారీ చేసిందన్నారు. ఎన్నికల అధికారులు అడిగిన వివరాలను ఇవ్వాలని నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ అంకిత్ ను కలిశానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తనను అవమానపరిచారని తెలిపారు. దీంతో తాను ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి పమేలా సత్పతికి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. దళితుడినైన తనను అవమానపరిచే విధంగా వ్యవహరించిన సదరు అధికారిపై చర్య తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.