Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 2:45 pm Posted by : ramakrishna

పోలిస్ స్టేషన్ అవరరణలో పిర్యాది పై కత్తులతో దాడి

 

. . . మున్సిపల్ ఉద్యోగి  శరీరంపై నాలుగు కత్తిపోట్లు

. . . భూమి కొనుగోలు వివాదంలో దాడి

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

తనకు జరిగిన  అన్యాయం, దౌర్జన్యంపై పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసేందుకు వెళ్లిన వ్యక్తి పై కత్తులతో దాడి జరగింది. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగర శివారులోని మాణిక్ బండర్ గ్రామానికి చెందిన వినయ్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగి గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం వినయ్ కుమార్ పై అదే గ్రామానికి చెందిన చెందిన  ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటన దాస్ నగర్  లో మాక్లూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జరుగడం కలకలం రేపింది. బాధితుడు వినయ్ ను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు. వినయ్ కు సంబంధించిన భూమిని తక్కువ రేటుకు ఇవ్వాలని పోరుగు వారు కోరుతున్నట్టు తెలిసింది. అయితే మార్కెట్ రేటు కాకుండా తక్కువ ధరకు ఇవ్వాలని ఓ యువకుడు శుక్రవారం ఉదయం వినయ్ తో ఇంటి వద్ద గొడవకు దిగినట్లు తెలిసింది. అక్కడ ఘర్షణ నేపథ్యంలో వినయ్ పోలిస్  స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు పిఎస్ కు వెళ్లారు. మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో కారు దిగిన వినయ్ పై  ముగ్గురు వ్యక్తులు కత్తితో పొడవడం తో అతనికి నాలుగు చోట్ల కత్తిపోట్లకు గురయ్యాడు. వినయ్ కేకలు విన్న పోలీసులు బయటకు వచ్చి వారి నుంచి అతడిని రక్షించి అసుపత్రికి తరలించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.వినయ్ పై కత్తులతో దాడి జరిగిన సంఘటన విషయం తెలిసిన గ్రామస్థులు, ధళితులు పోలిస్ స్టేషన్ కు వచ్చి దాడిచేసిన వ్యక్తులను అప్పగించాలని డిమాండ్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.ఈ విషయంలో వాస్తవాలను తెలసుకునేందుకు నార్త్ రూరల్ సర్కిల్ సిఐ శ్రీనివాస్ స్పందించి ప్లాట్ వివాధంలో గోడవలు జరిగి కత్తిపోట్లు జరిగియన్నారు.

 

Complainant attacked with a knife on police station premises