Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 April 2025, 1:59 pm Posted by : ramakrishna

ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలి

జగిత్యాల, బతుకమ్మ: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరాకు రూ.50వేల పరిహారం అందించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు.

వడగండ్ల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామంలో నాయకులతో కలిసి అర్వింద్ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టం పై వెంటనే సర్వే నిర్వహించాని, నష్టపరిహారం అందజేయాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.


Compensation of Rs. 50 thousand per acre should be provided.