Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2024, 11:53 am Posted by : ramakrishna

రైతుల ఖాతాల్లో నష్టపరిహారం జమ

. 676 మంది రైతుల ఖాతాల్లో రూ.86లక్షలు..

నిజామాబాద్, బతుకమ్మ:  రైతుల బ్యాంకు ఖాతాల్లో పంట నష్టపరిహారం జమ చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ మధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం మంజూరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 676 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.86,38,000 జమయ్యాయని తెలిపారు.