సమస్యల సత్వర పరిష్కారానికి వేదిక కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రజల తమ చిన్నచిన్న సమస్యల సత్వర పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ను ఉపయోగించుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత విద్యాశాఖ కార్యాలయ భవనంలో మంగళవారం కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. పల్లెటూర్లలో చిన్నచిన్న తగాదాలు వస్తే గ్రామంలోని పెద్దల సమక్షంలో పరిష్కరించుకునే వారని.. ప్రస్తుతం ఆ పరిస్థితి కనుమరుగైందని, పోలీస్ స్టేషన్ లను, కోర్టులను ఆశ్రయిస్తున్నారన్నారు. పోలీస్ స్టేషన్ లలో జాప్యం, కోర్టుల్లో ఎన్నో కేసులు...