Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 August 2024, 4:18 pm Posted by : ramakrishna

వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై  కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్య బృందం నిరసన

బతుకమ్మ బోధన్ : కలకత్తా ఆర్ జి కార్ ప్రభుత్వ ఆసుపత్రి పీజీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యను నిరసిస్తూ బోధన్ నియోజకవర్గంలోని మండలాల్లో వైద్య బృందం నిరసన వ్యక్తం చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు నవీపేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద వైద్యులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి, చేతిలో ఫ్లకార్డులు ఒక గంట పాటు నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కావ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళల వైద్యులపై జరుగుతున్న అరాచకాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి తగిన శిక్షలు విధించాలని కోరారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న హత్యాచారాలు, హత్యల సై ప్రతీ ఒక్కరు స్పందించాలని కోరారు. కలకత్తా ఘటనలో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.