Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 June 2025, 8:23 pm Posted by : ramakrishna

బోధన్ పట్టణంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వార్డ్ నంబర్  27 అంబేద్కర్ కాలనీలో నిజామాబాద్ సిపి ఆదేశాల మేరకు బోధన్ ఎసిపి శ్రీనివాస్,ఎస్ హెచ్ వో వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు.సరైన ధ్రువపత్రాలు లేని రెండు ఆటో లను,48 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా ఏసీపి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వాహనాల యొక్క ధ్రువపత్రాలను కలిగి ఉండాలని,హెల్మెట్ ను తప్పని సరిగా ధరించాలని,మైనర్లకు వాహనాలు ఇచ్చిన యెడల వాహనాన్ని సీజ్ చేయటం జరుగుతుందని యువత మత్తు  పదార్థాలకు గంజాయికి అలవాటు పడిన, పేకాట ఆడిన తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎసిపి శ్రీనివాస్ తో పాటు బోధన్ టౌన్, రూరల్ సిఐ,ఎస్ఐ లతో పాటు రుద్రూర్, వర్ని,కోటగిరి,ఎడపల్లి, ఎస్సైలు ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Community contact program in Bodhan town