Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 April 2025, 12:30 pm Posted by : ramakrishna

ఆర్మూర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్

. . .  ఫింగర్ ప్రింట్ పరికరం ద్వారా 20 మంది అనుమానితుల గుర్తింపు

. . .  61 వాహనాలు సీజ్

 ఆర్మూర్, బతుకమ్మ:

ప్రజల రక్షణ సురక్షిత లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని  కమలా నెహ్రూ కాలనీ , టీచర్స్ కాలనీ నందు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం జరిగింది.  ప్రొబేషనరీ ఐపీఎస్ సాయి కిరణ్  ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారు జామున పోలీసు అధికారులు ఈ కార్యక్రమం నిర్వహించారు.

Community contact in Armor

ఈ కార్యక్రమంలో దాదాపు 160 ఇంట్లో ను పరిశీలించారు.సరైన ధృవ పత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు,కార్ తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.  తొమ్మిది మంది సస్పెక్ట్ షీట్ కలిగిన వ్యక్తుల కదలికల గురించి ఆరా తీశారు. ఫింగర్ ప్రింట్ పరికరం ద్వారా 20 మంది అనుమానితులను గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఎసిపి వెంకటేశ్వర్ రెడ్డి, సీఐ లు సత్యనారాయణ, శ్రీధర్ రెడ్డి , 9 మంది ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు 110 మంది పాల్గొన్నారు.

Community contact in Armor