ప్రజల భద్రత కోసం కమ్యూనిటీ కాంటాక్ట్
కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర కామారెడ్డి, బతుకమ్మ : ప్రజల భద్రత కోసం శాంతిభద్రతలతో కూడిన సమాజాన్ని అందించడానికి పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని అందులో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేశ్ చంద్ర తెలిపారు. కామారెడ్డి ఏఎస్పీ బి.చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం గురువారం తెల్లవారుజామున నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బతుకమ్మ కుంట ప్రాంతంలో 235 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రవాణా నియమాలను ఉల్లంఘించిన 11ఆటోలను తాత్కాలికంగా...