Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 9:12 am Posted by : ramakrishna

కోటగిరిలో కమ్యూనికేషన్ కాంటాక్ట్ సర్చ్

 

కోటగిరి, బతుకమ్మ  : 

 

వరుస దొంగనాలు జరుగుతున్నా నేపథ్యంలో సిపి సాయి చైతన్య ఆదేశానుసారం గురువారం తెల్లవారుజామున బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తన బృందం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వినాయక నగర్ కాలనిలో కమ్యూనికేషన్ కాటన్ సెర్చ్ నిర్వహించారు. కాలనిలోని ఇండ్లను సోదా నిర్వహించి సుమారు యాభై బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా సిఐ కృష్ణ మాట్లాడుతూ మండల కేంద్రంలో జరుగుతున్నా దొంగతనాలను అరికట్టేందుకు కమ్యూనికేషన్ కాటన్ సెర్చ్ నిర్వహించామని ఆయన తెలిపారు. నిన్న రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో వినాయక్ నగర్ కాలనీలో ఒంటరిగా ఉంటున్న ఏముల లింగవ్వ అనే వృద్ధ మహిళ పై ఇద్దరు గుర్తు తెలియని దాడి చేసిన ఒంటిపై ఉన్న బంగారు గొలుసును ఎత్తుకెళ్లారని ఆయన తెలిపారు.

Communication contact search in Kotagiri

బంగారం రేటు రోజురోజుకు పెరుగుతున్న కారణంగా దొంగతనలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. తమ కాలనిలో గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. కమ్యూనికేషన్ కాటన్ సర్చ్ ద్వారా స్వాధీనం చేసుకున్న బైకులను సరియైన పత్రాలను చూయించి తీసుకోని వెళ్లాలని ఆయన తెలిపారు. పత్రాలు లేని వాహనాల పై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బోధన్ రూరల్ సీఐ విజయ్,వెంకట నారాయణ, సర్పంచ్ బర్ల మధుకర్, స్థానిక ఎస్ ఐ సునీల్ తో పాటు బోధన్,,రుద్రూర్, వర్ని మండలాల ఎస్ఐ లు, సిబ్బంది, పాల్గొన్నారు.

Communication contact search in Kotagiri