బార్‌లో తుపాకీతో యువకుడి బెదిరింపుల కలకలం
హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ సోమాజిగూడలోని హెడ్‌క్వార్టర్స్ బార్ అండ్ రెస్టారెంట్‌లో తుపాకీతో ఓ వ్యక్తి హల్‌చల్ చేసిన ఘటన కలకలం రేపింది. అక్టోబర్ 24 అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో రెండో అంతస్తులో కస్టమర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో బార్ సిబ్బంది జోక్యం చేసుకుని ఇరువర్గాలను బయటకు పంపించారు. అనంతరం వారిలో ఒకరు సెల్లార్‌లో పార్క్ చేసిన తన మహీంద్రా థార్ వాహనం వద్దకు వెళ్లి రివాల్వర్ తీసుకుని తిరిగి రెస్టారెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రౌండ్...