Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 April 2025, 9:31 pm Posted by : ramakrishna

కలెక్టర్ ను కలిసిన కమిషనర్

భీమ్ గల్, బతుకమ్మ : ఇటీవలే గ్రేడ్ త్రీ నుండి గ్రేడ్ టూ కమిషనర్ గా పదోన్నతి పొందిన భీమ్ గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ కలెక్టర్ రాజీవ్ హనుమంతును శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కలెక్టర్ కు బొకేనిచ్చి అభివాదం చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ కమిషనర్ గోపు గంగాధర్ కు ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాడ్స్ తెలిపారు. అనంతరం భీమ్ గల్ మున్సిపల్ కార్యాలయం లో సిబ్బంది ప్రమోషన్ వచ్చిన సందర్బంగా కమిషనర్ ను శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం లో మున్సిపల్ మేనేజర్ నరేందర్, ఆర్.ఐ బండి రాజేశ్వర్, వార్డు ఆఫీసర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Commissioner meets Collector