బతుకమ్మ, బోధన్ : భారీ వర్షం కారణంగా పట్టణంలో ఏర్పడిన నీటమునిగిన పరిస్థితులను పరిశీలించేందుకు నేడు మున్సిపల్ కమిషనర్ , ఎస్.ఐ సంయుక్తంగా పర్యటించారు. ఈ సందర్భంగా వారు 24, 35, 6, 5, 33, 34వ వార్డులు, పాతబస్తీ మరియు రకాసిపేట్ ప్రాంతాలను సందర్శించారు. వర్షం ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా గమనించి, మున్సిపల్ సిబ్బందికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటిమునిగిన కాలనీల్లో నీటి పారుదల పనులు చేపట్టి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే పరిస్థితులను సాధారణం చేశారు.
