నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల పెన్షన్ లో 11 సంవత్సరాలు మూడు నెలలు దాటిన వారికి కమిటేషన్ పేరున కోతలు విధించడాన్ని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజాంబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం డిప్యూటీ డైరెక్టర్ జిల్లా ట్రెజరీ అధికారి దశరథ్ కు మెమోరాండం అందజేశారు. చట్ట విరుద్ధంగా పెన్షనర్ల వద్ద నుండి ప్రభుత్వం ఈ కోతలకు పాల్పడిందని, దీనిని వెంటనే నిలుపుదల చేయాలని పలువురు పెన్షనర్లు తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించగా దీనిపై ఈ నెల 21 న తీర్పు వచ్చిందని తెలిపారు. ఆ ప్రకారంగా నవంబర్ 24 నుండి కోతలను నిలుపుచేయాలని ఉత్తర్వులు ఇచ్చినట్లు సంఘం జిల్లా అధ్యక్షులు కె.రామ్మోహన్ రావు తెలిపారు. అదేవిధంగా ఇప్పటివరకు పెన్షనర్ల వద్ద నుండి అక్రమంగా వసూలు చేసిన డబ్బును తిరిగి పెన్షనర్ల ఖాతాలో వేయాలని వారు డిమాండ్ చేశారు. డి టి వో ను కలసినవారిలో జిల్లా నాయకులు డి. లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, బుచ్చి రాజయ్య, నరేందర్, పుండరీ నీలం రెడ్డి, తదితరులు ఉన్నారు.