Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 March 2025, 8:23 pm Posted by : ramakrishna

లొద్ది రామన్న జాతరకు రండి

  • టీపీసీసీ ప్రెసిడెంట్ ను ఆహ్వానించిన వీడీసీ

 

భీమ్ గల్, బతుకమ్మ :  మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన శ్రీ లొద్ది రామన్న కల్యాణ మహోత్సవ వేడుకలకు రావాలని టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు ఆహ్వానం పలికారు. పిప్రి వీడీసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబానికి లొద్ది రామన్న ఆలయంతో అనుబంధం ఈ ఆలయ ఉత్సవాల్లో పాల్గొనాలని వీడీసీ సభ్యులు కోరారు. అందుకు స్పందించిన పీసీసీ అధ్యక్షులు అవకాశం ఉంటే తప్పకుండ హాజరు అవుతానని హామీ ఇచ్చారు. పీసీసీ ని కలిసిన వారిలో పిప్రి వీడీసీ సభ్యులు గుర్జికింది లింబాద్రి, గొల్ల లింబన్న, లోక్కిడి అశోక్, ఆరిగేల జనార్దన్, పతాని జేమ్స్ ఉన్నారు.