Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 6:36 pm Posted by : ramakrishna

బీఆర్ఎస్ లోకి రండి

 

. . . జీవన్ రెడ్డిని ఆహ్వానించిన కేటిఆర్

 

జగిత్యాల, బతుకమ్మ:

 

జగిత్యాల జిల్లాలో సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు తాటిపర్తి జీవన్ రెడ్డి భారత రాష్ట్ర సమితిలో చేరాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కోరారు. జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా కేటిఆర్ గురువారం జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని బిఆర్ఎస్ లో చేరాలని కేసిఆర్ తెలంగాణ ఏర్పడినప్పుడే ఆహ్వానించారని గుర్తు చేశారు. జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లో చేరితే సముచిత స్థానం గౌరవం కల్పిస్తామని అన్నారు. కేటిఆర్ వెంట మాజీ మంత్రులు ఈశ్వర్, రమణ, గంగుల కమాలకర్, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్, ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డిలు ఉన్నారు.

 

Come into BRS.

 

బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్న : జీవన్ రెడ్డి

బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. జగిత్యాలలో కేటీఆర్ తో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ తో కలిసి పని చేస్తే రాష్ట్ర భవిష్యత్తుకు పాటుపడవచ్చని, 27 నెలలుగా చాలా క్షోభ అనుభవించానని అన్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసినప్పడు భావోద్వేగానికి గురయ్యానని, శేష జీవితంలో కేసీఆర్ తో పని చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ కంటే మెరుగైన పాలన అందిస్తారని కాంగ్రెస్ కు ప్రజలు ఓటేశారని, కానీ ఈ రెండెళ్ల పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో నడిచిందని ఆయన పేర్కొన్నారు.