నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నగరంలోని మాధవనగర్ లో ఉన్న బీఎల్ఎన్ గార్డెన్స్ లో అమెచ్యూర్ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కోర్టు న్యాయమూర్తులు సునీత కుంచాల, పద్మావతి హాజరయ్యారు. తైక్వాండో అసోసియేషన్ చైర్మన్ బసవ లక్ష్మీ నరసయ్య, వైస్ చైర్మన్ నరేంద్ర గుప్తా, శ్రీనివాస సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డాక్టర్ శ్రీనివాస్, బ్లాక్ బెల్ట్ నేహా, గంగాధర్, నాగరాజ్, సిద్ధార్థ, రిత్విక, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.