చెరువులను తలపిస్తున్న కాలనీలు
బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలో రాత్రి కురిసిన భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా సరస్వతి నగర్ కాలనీ నీటమునిగిపోయింది. రాత్రి వేళ వర్షం కారణంగా పలు కాలనీల్లోని రహదారులన్నీ మురుగు నీటితో నిండిపోయాయి. స్థానికులు ఇళ్లలోనే చిక్కుకుపోయారు. కాలనీలో సక్రమమైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేసింది. వర్షపు నీరు బయటకు వెళ్లకపోవడంతో వీధులు మొత్తం మురుగునీటితో నిండిపోయి దుర్వాసన వ్యాపిస్తోంది. నీరు నిల్వ ఉండడంతో దోమలు బెడదతో వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని...