నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో లే మాన్ టు లా మాన్ అనే అంశంపై శుక్రవారం కాలోక్వియం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త గా డా. టి. రఘు రామ్, రిజిస్ట్రార్ (రిటైర్డ్) హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, స్పెషల్ జడ్జ్ (రిటైర్డ్) ఫర్ ట్రయల్ ఆఫ్ సీబీఐ కేసెస్ హాజరయ్యారు. డా.టీ. రఘు రామ్ న్యాయ విద్యార్థులకు న్యాయ వృత్తిలో ఉన్న అవకాశాలు, న్యాయ వ్యవస్థలో ఉన్న బాధ్యతలు, న్యాయ విద్య యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. న్యాయ విద్యార్థులు సమాజంలో న్యాయస్థాపనకు ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని తెలిపారు. న్యాయవ్యవస్థ భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు జీవన విధానాలకు సాధికారత కల్పిస్తూ వాటి పరిరక్షణకు కావలసిన చట్టం, చట్టబద్ధమైన న్యాయ సూత్రాలను ప్రజలకు వివరిస్తుందని, పాలన యంత్రాంగాన్ని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచనలిస్తుందని తెలియజేశారు. న్యాయవ్యవస్థ ఎల్లవేళలా దేశ పౌరుల స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడే దిశగా అడుగులు వేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.టీ.ఎల్లోసా, డా. కే. ప్రసన్న రాణి (ప్రిన్సిపాల్ అండ్ హెచ్ఓడి), డా. బి. స్రవంతి (ఛైర్పర్సన్ బీవోఎస్), విద్యార్థులు పాల్గొన్నారు.