Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 November 2025, 5:00 pm Posted by : ramakrishna

3 నుండి కళాశాలలు బంద్

  • ప్రైవేట్ కళాశాలల యాజమాన్య అసోసియేషన్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలల మనుగడ ప్రశ్నార్థకం అయిందని, డబ్బులు రాని పక్షంలో కళాశాలలు నడపడం కష్టమని కళాశాలల రాష్ట్ర అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 3నుంచి అన్ని కళాశాలలను బందు పెడుతున్నామని తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ రిజిస్టర్ ఆచార్య యాదగిరిని, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గత మూడు సంవత్సరాల నుండి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు రాకపోవడంతో కళాశాల నిర్వహణ కష్టం అయిపోయిందని, జీతభత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల అయ్యేవరకు కళాశాలలు తెరిచే ఆస్కారం లేదని అసోసియేషన్ అధ్యక్షుడు జయపాల్ రెడ్డి, నరాల సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మరయ్య గౌడ్, శంకర్, గురువేందర్ రెడ్డి, సూర్య ప్రకాష్, శ్రీనివాస్, అరుణ్, గిరి, దత్తు, అనిల్, షకీల్, రషీద్, నవీన్, సత్యం, విజయ్ తదితరులు పాల్గొన్నారు.