Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 January 2025, 6:25 pm Posted by : ramakrishna

ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోతే కాలేజీలు నడపలేం

. . . జిల్లా కలెక్టర్ కు ప్రైవేట్ కళాశాల యాజమాన్యల వినతి

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా బకాయి పడ్డ ఫీజు రీయంబర్స్ మెంట్ డబ్బులను విడుదల చెయ్యకపోతే కాలేజీల నిర్వహణ తమతో కాదని కళాశాలల యాజమాన్యాలు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధి హనుమంతు తో మొరపెట్టుకున్నారు. నిజామాబాద్  ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం జిల్లా కలెక్టర్ ను సోమవారం కలిసి తమ భాధలను చెప్పుకున్నారు. వేల మంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిన తమకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చెయ్యకుండా జాప్యం చెయ్యడం న్యాయం కాదని అన్నారు. గత సంవత్సర కాలం నుండి సిబ్బంది జీతభత్యాలు కూడ చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. భవనాల అద్దెలు కూడ చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలను తీసుకు వెళ్లారని కలెక్టర్ గారికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షులు హరిప్రసాద్, కార్యదర్శి సంజీవ్, సూర్యప్రకాష్, నరాల సుధాకర్, శ్రీనివాస్, అరుణ్, రమణ, నవీన్,   రవి పటేల్, షేక్ రషీద్, గంగాధర్ రాజేందర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Colleges cannot run if fee reimbursement dues are not paid