ప్రజా పాలన దినోత్సవ వేడుకకు ముస్తాబైన కలెక్టరేట్
తుది ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీ.పీ నిజామాబాద్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించ తలపెట్టిన ప్రజాపాలన దినోత్సవ వేడుకకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) ముస్తాబైంది. తుది ఏర్పాట్లను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టరేట్ లో నిర్వహించనున్న ఈ వేడుక కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉదయం 10.00 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి...