ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన కలెక్టర్
మోపాల్, బతుకమ్మ: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ది చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వేను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. మోపాల్ మండల కేంద్రంతో పాటు కులాస్ పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సొంత స్థలం కలిగి ఉన్నారా,...